పార్టీలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. బాధ్యతలు నిర్వర్తించలేని వారికి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రానున్న 30 నుంచి 90 రోజుల్లో ప్రజా సమస్యలపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరారు. కీలక పదవుల్లో ఉన్న కొందరు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, లేనివారిని పార్టీ తప్పకుండా ఉపేక్షిస్తుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. దేశంలో అధికార పార్టీ రెచ్చిపోతున్న విద్వేషాలపై పోరాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.