పార్టీలో అందరూ బాధ్యతగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేనివారు వేరే వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. రానున్న 30 నుండి 90 రోజుల్లో ప్రజా సమస్యలపై రోడ్ మ్యాప్ సిద్ధంచేయాలని రాష్ట్ర ఇన్ ఛార్జిలను కోరారు. కీలక పదవుల్లో ఉన్న కొందరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, అలా లేని వారిని పార్టీ కచ్చితంగా విస్మరిస్తుందని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. దేశంలో అధికార పక్షం రగిలిస్తున్న విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.