జ్యోతిష్యంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో కొన్ని పనులు చేయకూడదంటారు. లేకపోతే నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందంటారు. సాయంత్రం పూట ఇల్లు ఊడ్చకూడదని, గడప మీద కూర్చోకూడదని, గోళ్లు కత్తిరించుకోకూడదని తరచుగా వింటూనే ఉంటాం. అయితే శాస్త్రాల ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం, జుట్టు, గడ్డం చేయించడం వంటివి చేయరాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత చెట్లు, మొక్కలను కూడా తాకకూడదంటారు.