ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పే టీడీపీ, జనసేన నాయకులు మీ గడప వద్దకు వస్తే వారిని ఆడవాళ్లు చీపుర్లు, మగవాళ్లు చెప్పులు పట్టుకొని తరిమి తరిమి కొట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయస్ జగన్ ముందకెళ్తున్నారని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.