కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన రాయలసీమ గర్జనకు భారీగా ప్రజలు తరలివస్తుండగా, పలువురు మంత్రులు, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు గళం విప్పారు. రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా జనం తరలివవచ్చారు. శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సభా స్థలికి ప్రజాప్రతినిధులు, మేధావులు చేరుకున్నారు. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు హాజరయ్యారు.