కర్నూలు జిల్లా, కోసిగిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తాయమ్మ అనే గర్భిణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాయమ్మతో రెండేళ్ల క్రితం నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఆమె గర్భిణీ అయ్యాక వివాహం చేసుకోవాలని కోరింది. ఆయన పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తాయమ్మ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.