ఖరీఫ్ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర కంటే పైసా తగ్గకుండా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ వ్యవస్థలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను అన్ని చోట్లా పరిష్కరించాలన్నారు.ధాన్యం సేకరణలో ముందుగానే గోనె సంచులు సిద్ధం చేయాలని ఆదేశించారు.రవాణా, సంచుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని రైతులకు తెలియజేయాలన్నారు.