పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన స్పిల్ చానల్లో ఇంజన్ పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. పోలవరం ఎఎస్‌ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పాత పోలవరం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు 20 ఇంజన్ పడవల్లో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ చానల్‌లోకి చేపల వేటకు వెళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో వాటాల వీరబాబుకి చెందిన పడవ ఇంజన్ ఆగిపోయి స్పిల్‌వే నుంచి వేగంగా ప్రవహిస్తున్న జలాల ప్రవాహ వేగానికి బోల్తాపడింది. పడవలో ఉన్న వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోశియ్య, వాటాల అప్పలస్వామి, సూరిమిల్లి కృష్ణమూర్తి గోదావరిలో పడి కొట్టుకు పోతుండడంతో స్థానిక మత్స్యకారులు తాళ్ళ సహాయంతో ముగ్గురిని కాపాడి బయటకు తీశారు. వాటాల అప్పలస్వామి (25) సూరిమిల్లి కృష్ణమూర్తి (32) గల్లంతయ్యారు. తీవ్ర గాయాలపాలైన వీరబాబు, స్పల్పగాయాలతో బయటపడ్డ సింహాచలం, పోశియ్యలు పోలవరంలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారులను డీఎస్పీ కె.లతా కుమారి పరామర్శించి వివరాలు తెలుసుకు న్నారు. గల్లంతైన వాటాల అప్పలస్వామికి 3 సంవ త్సరాల కూతురు, భార్య గర్భవతి కాగా, కృష్ణమూర్తికి 4 సంవత్సరాల కూతురు, 3 సంవ త్సరాల బాబు ఉన్నారు. అనుకోని దుర్ఘటనతో పాత పోలవరం మత్స్యకారుల వీధిలో విషాద చాయలు అలుముకున్నాయి. మత ్స్యకారులను ఆ ప్రాంతంలోకి వెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, చేపలు అఽధికంగా పడతాయనే ఆశతో కొంతమంది మత్స్యకారులు ప్రమాదకర ప్రాంతమైన వేటకు వెళుతున్నారని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు.