రైతులను నమ్మించి సుమారు రూ.రెండు కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, దళారీల నుంచి రైతులకు చెల్లించాల్సిన బకా యిలను వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యా లయం వద్ద సీపీఐ అనుబంధ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం నేతలు మాట్లాడుతూ విస్సన్నపేట మండలం మల్లెలకి చెందిన బి.కిషోర్ కొంతకాలం క్రితం చనుబండ సొసైటీ కొనుగోలు కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే సకాలంలో కొనుగోలు కేంద్రం తెరవకపోవడంతో నూజివీడు డివిజన్ పరిధిలోని గ్రామా లైన చనుబండ, ఆరుగొలనుపేట, నర్మదానగర్, జనార్దన వరం, తదితర గ్రామా లకు చెందిన రైతుల నుంచి కిషోర్ రెండుకోట్ల విలువైన ధాన్యం, మొక్కజొన్న లను కొనుగోలు చేశాడు. వెంటనే డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికి ధాన్యం తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా... చెల్లించలేదు. అంతేకా కుండా ఫోన్ స్విచ్‌ఆఫ్ చేయడంతో వారంతా మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆదర్ష్‌రాజేంద్రన్‌కు వినతిపత్రం అందించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు, రైతు సంఘ నాయకులు జమలయ్య, కొమ్మన నాగేశ్వరరావు, ఆర్.లక్ష్మణరావు, చలసాని నరేంద్ర, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, సీహెచ్ పుల్లారావు పాల్గొన్నారు.