తనకు అత్యధిక ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది జగనరెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. అనంతపురం మండలంలోని రుద్రంపేట పంచాయతీ వికలాంగుల కాలనీ, విశ్వశాంతినగర్ ప్రాంతాల్లో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ మూడేళ్ల పాలనను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పెరిగిన నిత్యవసర ధరలు, ఇతరత్ర వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రుద్రంపేట అభివృద్ధి చెందిందంటే అది టీడీపీ ప్రభుత్వంలోనేనన్నారు. మూడేళ్లలో స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రజలు చెబుతున్నారన్నారు. వరదల సమయంలో కాలనీలవైపు తొంగి చూడలేదని ప్రజలు వాపోతున్నా రన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందన్నారు. తరువాత కాలనీలోని సమస్యలు పరిష్కరించి, కాలనీలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సాకే గంపన్న, దేవళ్ల మురళీ, సాలార్‌బాషా, నాగరాజు, మారుతికుమార్ గౌడ్, వెంకటే్‌షగౌడ్, గుర్రం నాగభూషణం, రఘు రాయల్, గోపాల్ గౌడ్, సర్దార్, పూలబాషా, జేఎంబాషా, మురళీ, శివబాల, విజయశ్రీ, సంగా తేజస్విణి, కంటాదేవి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.