పెనుకొండ మండల పరిధిలోని నగర పంచాయతీ పరిధిలోని గ్రామాల వారిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం జగనన్న కాలనీలో గృహ లబ్ధిదారులకు ఒక సెంటు స్థలము మరియు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వము 1, 80, 000 నిధులు మంజూరు చేస్తామని లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నదని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఏమి ఆసరాలేని నిరుపేదలకు సెంట్టున్నర స్థలము, 1, 80, 000 రూపాయలు నగదు ఇవ్వడం పునాదులు కూడా సరిపోదన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టించి ఇస్తానని తెలిపారన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి రుణ బాధలు లేకుండా చేస్తానని మాట తప్పను మడమ తిప్పను అన్న నానుడి ప్రకారము ఇప్పుడు లబ్ధిదారుల యొక్క మెడ మీద కత్తి పెట్టి ఇల్లు నిర్మాణాలు చేపడతారా లేక రద్దు చేయాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. లబ్ధిదారులు యొక్క సమస్యను ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని ప్రతి గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాఫర్, వెంకట లక్ష్మమ్మ, కమలేష్ నాయక్, భానుబి , అంజి , రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.