అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. బుక్కపట్నం మండలంలోని అటవీ ప్రాంతంలో గల నరసింహపల్లి, నార్సింపల్లి తండాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సాగింది. మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే వైకాపాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa