అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో మంగళవారం 60 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడాడుతూ 1963 సంవత్సరంలో ఆవర్భవించిన హోంగార్డు వ్యవస్థ పోలీసుశాఖలో కీలకంగా మారింది. పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. సాధారణ డ్యూటీల మొదలు క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.