అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల అమాయకత్వం, అత్యాశలనే పెట్టుబడిగా పెట్టి వంచిస్తున్న సంకల్ప సిద్ధి లాంటి మోసపూరిత సంస్థలలో పెట్టుబడులు పెట్టి వంచనకు గురికాకండని తెలిపారు. వడ్డీ, బోనస్ లు అధికం, తక్కువ సమయంలో ఎక్కువ రాబడి అంటూ ఎరవేస్తూ గొలుసుకట్ట మోసాలు చేస్తున్నారని అప్రమత్తం కావాలని ప్రజలకు సూచించారు. అనధికార చిట్స్ నిర్వాహకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దండి. రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఉపయోగపడుతుందని అనధికార చిటీల నిర్వాహకులకు చిటీలు వేస్తే మోసపోతారని ఎస్పీ సూచించారు.