ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా స్విట్జర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ వో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 6-1 తేడాలో స్విట్జర్లాండ్ ను చిత్తుచేసింది. పోర్చుగల్ ఆటగాడు గొంకలో రామోస్ ఏకంగా మూడు గోల్స్ సాధించాడు. 17వ నిమిషంలో తొలి గోల్ సాధించిన రామోస్ ఆ తర్వాత 51వ నిమిషంలో రెండోది, 67వ నిమిషంలో మూడో గోల్ సాధించాడు. కాగా, ఈ కీలక మ్యాట్ లో రొనాల్డో లేకుండానే పోర్చుగల్ ఘన విజయం సాధించడం విశేషం. ఈ ఓటమితో స్విట్జర్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. స్విస్ జట్టును చిత్తు చేసిన పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోతో తలపడనుంది.