స్వీట్ కార్న్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నిర్మూలిస్తాయి. స్వీట్ కార్న్ లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, పైల్స్ సమస్యలకు స్వీట్ కార్న్ చెక్ పెడుతుంది. స్వీట్ కార్న్ లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు రక్తహీనతకు చెక్ పెడతాయి. వీటిలోని ఫాస్పరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఐరన్ ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి.