తనపై ఉన్న అవినీతి, అక్రమ కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్ నాటకం ఆడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయని మోదీకి, జగన్ ఘన సత్కారాలు చేయడం తన స్వార్థ ప్రయోజనాల కోసమేనన్నారు. కేసుల నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రజల మనోభావాలను మోదీకి తాకట్టుపెట్టారన్నారు. పీఎం పాదాలు పట్టుకున్నా సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు.