జమ్మూకాశ్మీర్ లో పేలుడు కలకలం సృష్టించింది. జమ్మూ సమీపంలోని సిధ్రా వంతెన వద్ద మంగళవారం రాత్రి అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పేలుడు ఘటనకు కారణాలపై తాము సోదాలు జరుపుతున్నామని, ఈ పేలుడుకు పాల్పడ్డ వారు ఎవరనేది ఇంకా తెలియలేదని జమ్మూ ఎస్పీ చందన్ కోహ్లి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa