ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలు, వృద్ధుల పింఛన్లు తొలగించడం సిగ్గుమాలిన చర్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 12:15 PM

దేశంలో అవినీతిలో అగ్రస్థానం వైసీపీదేనని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో రాష్ట్రానికి ఇదేంఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ.....  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అదే విధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలకల పరిశ్రమ దెబ్బతినడంతో అసలే పనులు కోల్పోయామని, ప్రభుత్వ పింఛన్లు సైతం రద్దు చేశారని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పేదలు, వృద్ధుల పింఛన్లు తొలగించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com