చేతివృత్తులు కుల వృత్తులను నిర్వీర్యం చేస్తూ బీసీ వర్గాలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి శావల దేవదత్ విమర్శించారు. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ మంగళవారం టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్ధల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో అందించారు. మాజీ జడ్పీచైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, కందిమళ్ల శేషగిరిరావు, పర్వతం శ్రీనివాసరావు, పంది శ్రీనివాసరావు, వెదురు వెంకటనర్సిరెడ్డి, వాసం మునియ్య, తదితరులు పాల్గొన్నారు.