తెనాలి పట్టణం 37వ వార్డు పరిధిలో రెండో రోజు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వంలో లా అబద్ధపు హామీలు ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.