తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కి బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. టీమిండియా ఆడబోయే మ్యాచుల్లో 2 మ్యాచ్ లను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వేదికలను బీసీసీఐ గురువారం ప్రకటించింది. జనవరి 18న న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే వన్డే మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇక మార్చి 19న ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే వన్డే మ్యాచ్ వైజాగ్ లో జరగనుంది.