గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో 99 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి తిరుగులేని విజయాలతో కాంగ్రెస్ను ఓడించింది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో గెలుపొందగా, గుజరాత్ లో తొలిసారిగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 4 స్థానాలు దక్కించుకున్నారు.