వైసిపి ప్రభుత్వంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీకి సైకో పాలన అక్కర్లేదని, సైకిల్ పాలన ఒక ముద్దు అని అన్నారు. నాలుగేళ్ల తర్వాత జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. విజయవాడ వైసీపీ సమావేశానికి బీసీలను బలవంతంగా తీసుకొచ్చారని ఆరోపించారు. వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ పథకాలకు కోత పెడతామని బెదిరించారని వాపోయారు.అదే సమయంలో టీడీపీ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.