వైసీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, పరిశీలకులతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలో పనిచేస్తున్న ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. గడపగడపకూ కార్యక్రమంపై నివేదికను పార్టీ శ్రేణుల ముందు ఉంచి వారికి సూచనలు చేయనున్నారు.