సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్‌కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్‌లో అమ్ముకున్నట్లు తేలింది. బోట్ మాల్‌వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్ల ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని దొంగలించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది.