పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అనుచిత ఈ మెయిల్స్ పంపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు గత కొన్ని రోజులుగా అనుచిత ఈ మెయిల్స్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో పంపుతున్నారు. ఫ్యాట్ బో, స్లిమ్ బాయ్, డెత్ గోస్ట్ వంటి అనేక యూజర్ల పేర్లతో ఈ మెయిల్స్ వస్తుండగా.. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. స్విట్జర్లాండ్ లోని ప్రోటాన్ మెయిల్ సర్వీస్ ద్వారా ఎన్ క్రిప్టెడ్ విధానంలో ఈ మెయిల్స్ పంపుతున్నట్లు గుర్తించి.. నిందితుడు దీపంజన్ మిత్రను అరెస్ట్ చేశారు.