గాలివీడు మండలంలోని వెలిగల్లు జలాశయం నుంచి గురువారం 230 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గరిష్ఠ నీటి సామర్థ్యం 4. 64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4. 59 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 170 క్యూసెక్కుల నీరు చేరుతుందని జలాశయం డీఈ జనార్దన్ తెలిపారు. తుపాను ప్రభావంతో డ్యాంలోకి నీరు వస్తే ఏ సమయంలోనైనా దిగవన నదికి విడుదల చేస్తామన్నారు. అందు కోసం రాత్రుల్లో సిబ్బందిని కాపాలా ఉంచామన్నారు.