ఏపీ, తెలంగాణలకు రెండు వందే భారత్ రైళ్లను కేటాయించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలి రైలును వచ్చే ఏడాది జనవరిలో సికింద్రబాద్- విజయవాడ మధ్య దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రారంభించనున్నారు. ఈ రైలు గంటకు 165కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఆ రైలును తొలుత కాజీపేట మీదుగా విజయవాడ వరకు నడిపి, ఆ తర్వాత విశాఖపట్నం వరకు పొడిగిస్తారు. రెండోరైలును సికింద్రబాద్-తిరుపతి రూట్లో నడపనున్నారు. ఈ రైలును కూడా విజయవాడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు.