భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన 2 వన్డేల్లో బంగ్లాదేశ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో మూడో వన్డేలోనైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో జట్టులో 2, 3 మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేయాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. రేపటి మ్యాచ్ ఉదయం 11:30 గంటల నుంచి జరగనుంది.