మాండూస్ తుఫాను నేపథ్యంలో నేటి (శుక్రవారం) మధ్యాహ్నం నుండి చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపారు.
మాండూస్ తుఫాను కారణంగా జిల్లాలో అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయా పాఠశాలల పరిధిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డివైఓలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్ లు జాగ్రత్తలు వహించాలి. ఈ ఆదేశాలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంఈఓ లు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులు వాగులు వంకలు చెరువులు వద్దకు వెళ్లకూడదని టీచర్లు సూచించాలి. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే ఎంఈఓ లు డీఈవో కార్యాలయం దృష్టికి తీసుకురావాలన్నారు.