వైసీపీ నేతలతో సీఎం జగన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్ గా గుర్తించాలన్నారు. క్లస్టర్ కి ఇద్దరు గ్రామ సారథులను నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని ఆదేశాలిచ్చారు. కన్వీనర్లలో ఒక్కరు మహిళ ఉంటారని చెప్పారు. రాజకీయ అవగాహన ఉన్నవారిని, చురుగ్గా ఉన్నవారిని కన్వీనర్లుగా ఎంపిక చేయాలన్నారు.