దేశంలో అన్ని రాష్ట్రాల్లో కెల్లా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఈమేరకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.111.87, డీజిల్ రూ.99.61 మేర ఉంది. మరే రాష్ట్రంలోనూ ఈ ధరలు లేవు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యల్పంగా పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74కి విక్రయిస్తున్నారు.