వారాహి వాహనం రంగులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపించి వేశారని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో సైతం తను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారన్నారు. ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు. అయితే పవన్ ఆలివ్ గ్రీన్ కలర్ వెహికిల్ వాడకంపై.. సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989, చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప ప్రయివేటు వ్యక్తులు తమ వాహనాలకు అలీవ్ గ్రీన్ కలర్ వాడటం నిషిద్ధమని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.