జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్ యాత్రకి సంబంధించి ఏర్పాటు చేసిన వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన పార్టీ చట్టానికి ఉల్లంఘనగా ఏ పనీ చేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చి కోర్టులో మొట్టికాయలు తిన్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బిసి గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేశారని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ కాదు వైఎస్ఆర్టీసీ గా మార్చేశారని వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు పోరడుతోంటే చెక్ పవర్లు లాగేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల కబ్జాల గురించి సర్వే నెంబర్లతో సహా బాధితులు జనవాణిలో పాల్గొనేందుకు వచ్చారని జనసేన నేత తెలిపారు.