తన రాజకీయ భవిష్యత్తు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ‘‘నేను ఏ పార్టీ నుంచో పోటీ చేస్తానో... సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపు ఉంటాను’’ అని చెప్పిన లక్ష్మీనారాయణ ఏ పార్టీ యో స్పష్టత ఇవ్వలేదు. గత ఎన్నికల్లోనే బాండ్ పేపర్ రాశానని... తాను అనుకున్నది చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పానని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలవడం బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టు లో నడుస్తోందన్నారు. అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడితే సమస్యలే ఉండవని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.