బంగ్లాదేశ్‌తో రెండో వన్డే మ్యాచ్ వేళ గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం జరిగే చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఈ మేరకు రోహిత్ గాయంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇక రోహిత్ వేలికి గాయంతోనే రెండో వన్డేలో అద్భుతమైన పోరాటం చేసిన విషయం తెలిసిందే. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించాడు. ‘‘రోహిత్ చికిత్స కోసం ముంబయికి వెళ్లాడు. దీంతో శనివారం జరిగే మూడో వన్డేలో ఆడడు. అయితే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే కుల్దీప్‌సేన్, దీపక్ చాహర్ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరు"అని బీసీసీఐ వెల్లడించింది.