కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న రెండో దశ భారత్ జోడో యాత్ర జనవరి 3న పునఃప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. “ఈ రోజు రాహుల్ యాత్రకు విశ్రాంతి. యాత్రను బుండీ నుంచి కొనసాగిస్తాం. డిసెంబరు 18న అల్వార్ దగ్గర రాహుల్ గాంధీ మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. డిసెంబర్ 24 నాటికి యాత్ర ఢిల్లీకి చేరుకుంటుంది. జనవరి 3వ తేదీ ఉదయం మళ్లీ యాత్ర ప్రారంభిస్తాం’’ అని జైరాం రమేష్ తెలిపారు.