నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ విషయంలో బాంబే హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ముంబై పొరుగున ఉన్న పాల్ఘర్, థానే జిల్లాలలో సుమారు 22 వేల మడ చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చింది. పర్యావరణ, అటవీ శాఖ మార్గదర్శకాలు, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ (MOEFCC) నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. దీంతో హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) ఊరట దక్కింది.