రైతులకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రేషన్ కార్డులు ఉన్న రైతులకు, పేదలకు 150 కిలోల ఉచిత బియ్యం అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అమలు చేయబడిన ఉచిత రేషన్ ప్రోగ్రామ్‌కు ఇది అదనం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు అందుబాటులో ఉంటుంది. అక్టోబరు, నవంబర్ రెండు నెలల కోటా బియ్యాన్ని ఒక్కొక్కరికి ఒకేసారి అందజేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.