గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన సీఎం ఎంపికపై దృష్టి సారించనుంది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం గాంధీనగర్ లో సమావేశమై, తమ పార్టీ శాసననసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ గతంలోనే ప్రకటించింది.