గుంటూరు జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రి య నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం క్షేత్రస్థాయిలో భూరికార్డులు స్వచ్ఛీ కరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టరు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూరికార్డులు సక్రమంగా నిర్వహించటం ద్వారా రీసర్వే ప్రక్రియను గడువులోపు పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. రీసర్వే కంటే ముందు భూరికార్డుల స్వచ్ఛీ కరణ ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తహసీల్దారు దృష్టికి తీసుకురావాలని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ప్రతిరోజు జేసీ నివేదించాలని స్పష్టం చేశారు.