గుంటూరు జిల్లా పొన్నూరులో శుక్రవారం మధ్యాహ్నం ‘బాత్‌చీత్ విత్ బాబు’ అనే పేరుతో ముస్లింలతో చంద్రబాబు చర్చాగోష్ఠి నిర్వహించారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. ఆ వెంటనే... వైసీపీ సర్కారు రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తాం. వివిధ కారణాలు, సాకులతో పథకాలను దూరం చేసిన వారికి... వడ్డీతో సహా ఆ డబ్బులు చెల్లిస్తాం’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాత్రి బాపట్లలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో భాగంగా రోడ్‌షోకు హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజలంతా పోరాడండి. చైతన్యంతో తిరగబడండి. సంక్షేమ పథకాలు తీసివేసినా, కేసులు పెట్టినా కోర్టుల్లో పోరాడదాం. పెన్షన్ తీసివేసినా, ఇంకేదైనా రాకపోయినా, అకారణంగా ఆపేసినా చంద్రన్న వస్తాడు... వడ్డీతో ‘‘జగన్ పది రూపాయలు ఇచ్చి వందరూపాయలు దోచుకుంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే మనస్తత్వం జగన్‌ది.. అలాంటి భస్మాసురుడికి ప్రజలు అధికారమనే వరమిచ్చారు. వారి నెత్తిన వాళ్లే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పు జరగనివ్వొద్దు!’’ అని పిలుపునిచ్చారు.