గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే, గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.