ప్రస్తుత రోజుల్లో అందరూ హడావుడిగా భోజనం చేస్తున్నారు. కానీ, ఇలా తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారాన్ని కనీసం 30 నుండి 35 నిమిషాలు తినాలని, పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలని సూచిస్తున్నారు. ఎలా పడితే అలా తింటే ఖచ్చితంగా జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ప్రయాణం చేసే సమయంలో అస్సలు భోజనం చేయకూడదని తెలిపారు. అంతే కాకుండా రాత్రి 8కి ముందే భోజనం చేయాలని, ఆ తర్వాత చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు.