భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ గడ్డపై వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడే వన్డేలో 59పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర(1045) పేరిట ఉండగా, తాజాగా కోహ్లి ఈ రికార్డును బద్దలుకొట్టాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన కోహ్లీ, ఆఖరి వన్డేలో రాణించాడు. తన కెరీర్లో 72వ సెంచరీని సాధించాడు. 91 బంతుల్లో 113 పరుగులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో లిట్టన్ దాస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.