మహారాష్ట్రలో ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు ట్రాన్స్ జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ తెలిపింది. ఈ మేరకు ఆన్ లైన్ అప్లికేషన్ విధానంలో అసరమైన మార్పులు చేస్తామని హైకోర్టుకు వివరణ ఇచ్చింది. అలాగే దరఖాస్తు గడువును సైతం ఈ నెల 15 వరకూ పొడిగించినట్లు పేర్కొంది. కాగా, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో ట్రాన్స్ జెండర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారిస్తోంది. ట్రాన్స్ జెండర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.