కేంద్ర ప్రభుత్వం బెంగుళూరు నగరానికి మర 921 ఎలక్ట్రికల్ బస్సులు అందించనుంది. ఫేమ్-2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్ ద్వారా ఈ బస్సులను కొనుగోలు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాగా, ఈ బస్సుల కొనుగోళ్ల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించనుంది. ఒక్కో బస్సు ధర 1.50 కోట్లు ఉండగా, దీంట్లో కేంద్రం రూ.39.08 లక్షలు ఇవ్వనుండగా, మిగతా మొత్తాన్ని సీఈఎస్ఎల్ కంపెనీ సమకూర్చుకోనుంది. నగర శివారు ప్రాంతాలు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలకు ఈ బస్సులను నడపనున్నారు.