ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒకటవ తేదీన చెల్లించాల్సిన జీతభత్యాలను మరిచారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ నిలదీశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం బద్వేల్ లోని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద జోరు వానలో హోరు నినాదాలతో గొడుగులు ధరించి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విజయ కుమార్ మాట్లాడుతూ ఒకటవ తేదీ చెల్లించాల్సిన వేతనాలను 10వ తేదీ దాటినా చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్. శశిధర్ కుమార్, బద్వేలు మండల అధ్యక్షులు టి. శివ ప్రసాద్, ట్రెజరర్ ఎ. గుర్రయ్య, గోపవరం మండల ప్రధాన కార్యదర్శి సి. కంచిరెడ్డి, ట్రెజరర్ యం. రామచంద్రయ్య, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు ఏ. వి. రమణయ్య, యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పాలా శ్రీనివాసరెడ్డి, పబ్బతి చక్రపాణి, పి. చంద్రశేఖర్ యాదవ్, ఎస్. దేవానందం, ఎస్. చెన్నయ్య, గౌస్ బాషా, ఎస్. మస్తాన్ వలి, నాయకులు యం. శివకుమార్, టి. వి. సుబ్బారావు, పి. ఆర్థర్, శ్రీనివాసులు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.