గుజరాత్ సీఎంగా నేడు భూపేంద్రపటేల్ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాంధీనగర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్రతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రమాణం చేయిస్తారు. 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో BJP 156 స్థానాలు గెలుచుకుని వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్‌పార్టీకి 17, ఆప్‌నకు 5 స్థానాలు దక్కాయి. 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ శుక్రవారం తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేయగా, శనివారం ఆయనను BJP శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.